ETV Bharat / state

మోకే ఉరితాడైంది... ఉపాధినిచ్చే చెట్టే ఉరిస్తంభమైంది! - పెద్దపల్లి జిల్లా నేర వార్తలు

తనకు ఉపాధి నిచ్చిన తాటి చెట్టే... ఉరి స్తంభమైంది. అది ఎక్కడానికి ఉపయోగించే మోకే ఉరితాడవుతోందని ఆ గీత కార్మికుడు ఏనాడు అనుకోలేదు. పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లికి చెందిన గీత కార్మికుడు.. కల్లు తీసేందుకు చెట్టు ఎక్కగా మోకుతాడు ఉరిపడి ప్రాణాలు కోల్పోయాడు.

a toddy topper died on tree
ఉపాధి నిచ్చిన చెట్టే ఉరిస్తంభమై.. మోకే ఉరితాడై
author img

By

Published : Jun 17, 2020, 12:41 PM IST

పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లిలో విషాదం జరిగింది. కల్లు తీసేందుకు చెట్టు ఎక్కిన గీత కార్మికుడు మోకుతాడు ఉరిపడి చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన గీత కార్మికుడు మామిడి రాజయ్య మోకుతాడు ఉరిపడి మృత్యువాత పడ్డాడు.

గత రెండు రోజులుగా గ్రామంలో వర్షం కురుస్తూనే ఉంది. చెట్టు పూర్తిగా తడిపోసి జారిపోతోంది. అయినప్పటికీ రాజయ్య కల్లు గీసేందుకు చెట్టు ఎక్కాడు. పైకి వెళ్తుండగా కాళ్లకున్న గుది జారిపోయింది. రాజయ్య అదుపు తప్పి చెట్టుపైనే మెలితిరిగిపోయాడు. భూజానికి ఉండే మోకుతాడు మెడకు చుట్టుకుని ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి అవుతున్నప్పటికీ రాజయ్య ఇంటికి రాలేదు. తండ్రిని వెతుక్కుంటూ కొడుకు చెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టుపై వేలాడుతున్న తండ్రిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విషాదం: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.