తెలంగాణ వైపు దూసుకు వచ్చే మిడతల దండు ప్రయాణాన్ని అడ్డుకొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం తన కార్యాచరణ ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీ జ్యోతి అతిథి గృహంలో సభ్యులు సమావేశమయ్యారు. సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి సునిత, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.జె. రెహ్మాన్, వరంగల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతి సమావేశంలో పాల్గొన్నారు.
నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేసి మిడతల దండు ప్రయాణం ఎటువైపు సాగుతుందనే అంశాన్ని అంచనా వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గోదావరి తీరాన ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు విహంగ వీక్షణం ద్వారా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు