పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఎనిమిదవ కాలనీలో సింగరేణి జోనల్‌స్థాయి రెస్క్యూ పోటీలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ టీం 50వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రెండ్రోజులపాటు నిర్వహించే ఈ పోటీలను సింగరేణి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారి శ్యామ్ మిశ్రా జెండా ఎగురవేసి ప్రారంభించారు. సింగరేణిలో మొత్తం 11 డివిజన్ల నుంచి ఈ రెస్క్యూ పోటీల్లో 7 బృందాలు పాల్గొంటున్నాయి. డ్రిల్, పరేడ్, ప్రథమ చికిత్స, రెస్క్యూ, రెస్క్యూ రికవరీతో పాటు రెస్క్యూ సభ్యుల శారీరక శ్రమను అంచనా వేయడం కోసం కర్రదుంగలు మోయడం, నీటి పైపులను చాపడం, రంపంతో కర్రను కోయడం, ఇరుకైన స్థలం నుంచి బయటకు రావడం, మనిషి బరువుకి రెండింతల బరువు ఉండే యంత్రాల టైర్లను ఎత్తుకోని గమ్యస్థానాలకు చేరడం, ఎతైన ప్రదేశం నుంచి కిందికి దూకడం, దట్టమైన మంట నుంచి బయటకు రావడం వంటి క్రీడలు ఉంటాయి.
ఇదీ చూడండి : కాంగ్రెస్, భాజపా నాయకుల మధ్య తోపులాట