పెద్దపల్లి పట్టణ శివారులో రాజీవ్ రహదారి దాటుతున్న టవేరా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ కుటుంబం... వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి శనివారం సాయంత్రం తిరుగు పయణమయ్యారు. పెద్దపల్లి శివారులో రోడ్డు దాటుతుండగా... గోదావరిఖని వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్షతగాత్రులను స్థానికులు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : 'హామీలు నెరవేర్చని తెరాసకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది'