నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జడ్పీ ఛైర్మన్ విఠల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను తిరిగి... అక్కడి పరిస్థితులను పరిశీలించారు. గైనిక్ వార్డులో సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
సూపరింటెండెంట్ అన్నపూర్ణ ఆసుపత్రిలోని సమస్యలను జడ్పీ ఛైర్మన్‌కు వివరించారు. భవనంలోని కొన్ని సమస్యల గురించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి... వెంటనే వాటిని పరిష్కరించాలని విఠల్ సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి తాను అన్నివిధాల తోడ్పడతానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: గోదాములో అగ్ని ప్రమాదం- ఆరుగురు మృతి