ETV Bharat / state

ys sharmila: 'ఈ ఏడేళ్లలో తెలంగాణలో ఏ వర్గం బాగుపడింది' - తెలంగాణ వైఎస్​ఆర్​ పార్టీ

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం డిచ్‌పల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు(ys sharmila protest). నిజామాబాద్​లో పసుపు బోర్డు తీసుకొస్తామని బాండ్​పేపర్​ రాసిచ్చిన ఎంపీ ఎక్కడ, ఉద్యోగాలు ఇస్తామని, బోధన్​ షుగర్​ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఎన్నికల్లో హామీలు నేతలు ఎక్కడని ప్రశ్నించారు.

sharmila
sharmila
author img

By

Published : Oct 5, 2021, 10:24 PM IST

ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో భాగంగా వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(ys sharmila) నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో దీక్ష చేపట్టారు (Sharmila unemployment hunger strike). నిజామాబాద్ (nizamabad) జిల్లాలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా ఎన్నికల హామీలను తెరాస ప్రభుత్వం అమలుచేయలేదని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తానని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.

పసుపు బోర్డు సాధనకు కృషి చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన భాజపా ఎంపీ.. రైతన్నలను మోసం చేశాడని విమర్శించారు. జిల్లాలో అభివృద్ధిని తెరాస, భాజపా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్​ తన కుటుంబంలో అయిదుగురికి ఉద్యోగాలు కల్పించి.. తెలంగాణలో కేవలం నాలుగు శాతం మేర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశాలున్నాయని చెప్పడం కేటీఆర్ చేతకానితనమని దుయ్యబట్టారు. కార్యక్రమంలో గాయకుడు సోమన్న, నిజామాబాద్ పార్లమెంట్ వైఎస్​ఆర్​టీపీ ఇంఛార్జ్​ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

'ఈ ఏడేళ్లలో తెలంగాణలో ఏ వర్గం బాగుపడింది'

పసుపుబోర్డు తెస్తామని.. మాటలతో చెబితే నమ్మడం లేదని బాండు పేపర్​పై సంతకం చేసి ఇచ్చారు భాజపా ఎంపీ.. మరి తీసుకొచ్చారా..? తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడున్న ప్రతిపక్షం అందరూ కలిసి పేదలను మోసం చేస్తున్నారు. నిజాం షుగర్​ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చారు. మరి తెరిచి ఉందా..? ఈ ఏడేళ్లలో ఏ వర్గం బాగుపడింది తెలంగాణలో..? ఏడువేల మంది రైతులు, వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హుజూరాబాద్​లో ఉప ఎన్నికలో మా ప్రోత్సాహంతో వంద మంది ఫీల్డ్​ అసిస్టెంట్లను, నిరుద్యోగులను నామినేషన్​ వేయమని చెబితే.. వారు నామినేషన్​ వేయడానికి వెళ్లినప్పుడు వాళ్లను పోలీసులు అరెస్టు చేసి ఓ రోజంతా జైళ్లో పెట్టారు. ఎందుకు కేసీఆర్​ గారు మీకంత భయం..? మేము పోరాడతాం.. నిరుద్యోగుల పక్షాన నిలవాలని అనుకున్నాము.. నిలబడతామని చెబుతున్నాం. కనుక లక్షా 91వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తున్నాం. - వైఎస్​ షర్మిల, వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు.

ఇదీ చూడండి: Ys Sharmila on Tu Vc: 'వీసీ పోస్టు కోసం కేటీఆర్​కు రెండు కోట్లు ఇచ్చాడంటా!​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.