నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్డుపై ఏర్పడిన గుంతలను స్థానిక యువత చందాలు వసూలు చేసి గుంతలను పూడ్చారు. గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ.. రహదారిపై వెళ్లే వాహనదారులను ఆపి చందాలు వసూలు చేసి గుంతలను పూడ్చారు. బోధన్ నుంచి నాందేడ్ వెళ్లే రహదారిపై గుంత పెద్దగా ఏర్పడడం వల్ల వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాలు పడితే గుంతలో నీళ్లు నిలిచి ఎక్కడిక్కడ గుంతలు ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువకులు వాపోయారు.
ఇవీ చూడండి : ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్