ETV Bharat / state

Y category security for MP Arvind : ఎంపీ అర్వింద్​కు 'వై' కేటగిరీ భద్రత.. ఈటలకు 'వై ప్లస్' - ఈటల రాజేందర్ తాజా వార్తలు

MP Arvind Y Category Security : రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ వై, వై ప్లస్‌ భద్రతను కేటాయించింది. తెలంగాణలో బీజేపీ నేతలకు పటిష్ఠ భద్రత కోసం ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కుమార్‌కు వై కేటగిరి భద్రతను కల్పించింది. అలాగే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది.

ARVIND
ARVIND
author img

By

Published : Jul 10, 2023, 1:25 PM IST

Y Category Security to MP Dharmapuri Arvind : తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బీఆర్​ఎస్ ముచ్చటగా మూడోసారి గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా... మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ జనాకర్షణను పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేతల మధ్య ఆరోపణలు-ప్రతిఆరోపణలు తీవ్ర స్థాయిలో పేలుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నేతల భద్రత విషయంలోను పార్టీలు ఆచితూచి వ్యవహారిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్​గా పేరు తెచ్చుకున్న నేతలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

MP Arvind Y Category Security : అందులో భాగంగానే తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ వై, వై ప్లస్‌ భద్రతను కేటాయించింది. బీఆర్​ఎస్ సర్కారును ఢీకొట్టే అత్యంత బలమైన నేతలు.. దీటుగా ప్రశ్నించే నాయకులకు ఫ్రీ హ్యాండ్ కల్పించనుంది. అందులో ఒకరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ కుమార్​కు 8 మందితో వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐబీ బృందంతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత వివరాలతో పాటు ఎంపీ అర్వింద్​కు సంబంధించిన కార్యాలయం, నివాసం పరిసర ప్రాంతాల ఫోటోలను సేకరించారు.

8 మందితో ఎంపీ అర్వింద్​కు వై కేటగిరీ భద్రత : ఎంపీ అర్వింద్ క్వాన్వాయ్‌లో ఆయన వ్యక్తిగత వాహనంతో పాటు ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి. అర్వింద్ వెంట ముగ్గురు సెక్యూరిటీతో పాటు ఆయన నివాసం వద్ద ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఒక గార్డ్ కమాండర్ ఉంటారు. ఆటోమెటిక్ ఆయుధాలను స్పెషల్‌ సెక్యూరిటీ సిబ్బంది కలిగి ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా మరింత దూకుడు పెంచమని, అందుకు అండగా ఉంటామని అర్వింద్​కు జాతీయ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో కేసీఆర్​ కుటుంబం, ప్రభుత్వంపై ఢీ అంటే ఢీ అనేలా ఎంపీ అర్వింద్ ఫైట్​కు సిద్ధమైనారు. గతంలో అర్వింద్ ఇంటిపై ఎమ్మెల్సీ కవిత అనుచరుల దాడి నేపథ్యంలో.. కేంద్రం అండగా ఉండటంతో పాటు ఈ ప్రత్యేక భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.

Y + Security to MLA Etela Rajender : మరో నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్‌ రాష్ట్ర భద్రతను నిరాకరించి.. కేంద్ర భద్రతను కోరడంతో ఈ మేరకు నిర్ణయం వెలువడింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.