నిజామాబాద్ నగరంలో మహిళా కార్పొరేటర్ భర్తను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. స్థానిక 45వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్ భర్త.. తమ కూతురిని మోసం చేశాడంటూ ఉదయం కార్పొరేటర్ ఇంటి ముందు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కార్పొరేటర్ భర్త, బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవలో కార్పొరేటర్ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.
ఇదీ చదవండి: KTR latest news: కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు.. ఆ లేఖలో ఏముందంటే...