ETV Bharat / state

రైలులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డ క్షేమం - telangana latest news

ఓ గర్భిణీ రైలులోనే ప్రసవించింది. డెలివరీ కోసం తల్లితో కలిసి తమ సొంతూరికి వెళ్తుండగా.. మార్గమధ్యలోనే నొప్పులు రావడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సికింద్రాబాద్​ నుంచి ముంబయి వెళ్తున్న దేవగిరి రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది.

రైలులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డ క్షేమం

author img

By

Published : Sep 26, 2021, 11:15 PM IST

సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే దేవగిరి రైలులో ఓ నిండు గర్భిణీ ప్రసవించింది. పురిటినొప్పులు అధికమవ్వడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దేవగిరి రైలులో సాగర్ అనే ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు గమనించి 108కు సమాచారం అందించారు. అయితే రైలు నిజామాబాద్ స్టేషన్​కు వచ్చేసరికి గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం నిజామాబాద్​ స్టేషన్​ నుంచి తల్లీబిడ్డలను అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రసవం కోసం హైదరాబాద్​ నుంచి తల్లితో కలిసి ముద్ఖేడ్​కు వెళ్తుండగా మధ్యలోనే ఇలా ప్రసవించింది.

ఇదీ చూడండి: Moving scarecrow: ఆ రైతు పొలంలోని దిష్టిబొమ్మను చూస్తేనే అడవి జంతువులకు హడల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.