మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ఆరోగ్య రక్ష సంస్థ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక బస్వా గార్డెన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని.. 111 సూర్య నమస్కారాలు చేశారు.
గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య రక్ష సంస్థ వ్యవస్థాపకురాలు ఐశ్వర్య పేర్కొన్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట పాటైనా యోగా, సూర్య నమస్కారాలు చేస్తే ఒత్తిడిని జయించవచ్చని సూచించారు.
ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!