ఆశ్యర్యపర్చిన డీఎస్ సమావేశాలు...
అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న డీఎస్... రెండు రోజుల క్రితం నిర్వహించిన తెరాస పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. 24 గంటలు గడవకముందే భాజపా అధ్యక్షుడు అమిషాను కలిసి కార్యకర్తలకు మరో షాక్ ఇచ్చారు. తెలంగాణను టార్గెట్ చేసిన భాజపా నేతతో డీఎస్ భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎస్ కమలం గూటికి చేరితే పలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెరాసకు ప్రత్యామ్నయం భాజపానే అని ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నేతలు... ఆ దిశలో కార్యాచరణ ప్రారంభించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.
కాషాయ కండువా కప్పుకుంటారా...?
అమిత్ షాతో డీఎస్ భేటీ వెనుక ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. గత ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ను గెలిపించటం కోసం తెర వెనుక డీఎస్ పని చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం డీఎస్ తన పాత అనుచరులు, ప్రస్తుత రాజకీయ నాయకులు, సామాజిక వర్గానికి చెందిన కొందరిని ఎన్నికల్లో పురమాయించినట్లు చర్చ నడుస్తోంది. ఈ వార్తలే నిజమైతే కుమారుడు భాజపా ఎంపీగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే డి. శ్రీనివాస్ కాషాయ కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు