నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సంక్షేమ బాలుర వసతి గృహంలోని వసతులపై విద్యార్థులను ప్రశ్నించగా బోరున విలపించారు. హాస్టల్లో సౌకర్యాల లేమితో తీవ్ర అవస్థలు పడుతున్నట్లు వెల్లడించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి, రాత్రి సమయంలో పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు. ధైర్యం చెప్పాల్సిన సిబ్బంది మద్యం మత్తులో తూలుతూ తమ ఎదుట అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన పిల్లలను కొడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాత్రి సమయంలో వార్డెన్ ఇంటికి వెళ్లగానే వంట మనిషిగా విధులు నిర్వహించే విట్టల్ అనే వ్యక్తి నిత్యం మద్యం మత్తులో తేలుతున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. జిల్లా అధికారులు దీనిపై స్పందించి తమకు సరైన సౌకర్యాలు కలిపించాలని, అలక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.
ఇదీ చూడండి: తరగతి గదిలో తెరల చాటున విద్యాభ్యాసం