నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల నీరు చేరిందని ఈఈ రామారావు తెలిపారు. జలాశయ నీటి మట్టం 1091 అడుగుల్లో 1051.20 అడుగల వరకు ప్రస్తుతం నీటిమట్టం ఉంది. మహారాష్ట్ర నాసిక్ ప్రాంతాల్లో వానలు సమృద్ధిగా కురిస్తే ఈసారి జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని ఈఈ వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఏం బాబు చెట్టు కనపడలేదా..?