నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1075.5 అడుగులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి సుమారు 24 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 308 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కులు పంట పొలాలకు నీరందించేందుకు వదులుతున్నారు. ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు