నిజామాబాద్ జిల్లా మెండోరాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యటకులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రాజెక్టు అందాల్ని చూడటానికి అధికారులు అనుమతించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు తమకు కావాల్సిన వారిని ప్రాజెక్టు చూడటానికి అనుమతిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పైకి వాహనాలు అనుమతించినా.. పార్కింగ్ పేరిట డబ్బు వసూల్ చేస్తున్నారని వాపోయారు. డ్యాం పక్కనే ఉన్న నెహ్రూ పార్క్ వద్ద పార్కింగ్ ఫీజు వసూల్ చేయాలి.. కానీ అక్రమార్కులు ప్రాజెక్టు పైకి వెళ్లే వాహనాల నుంచి పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
- ఇదీ చూడండి : 38 రోజులకు బయటకొచ్చిన రాయల్ వశిష్ఠ బోటు