నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం రియల్ వ్యాపారి కలీం హత్య కేసులోని నిందితుడు బలరాం ఇంటిపై బాధిత కుటుంబ సభ్యులు దాడి చేశారు. నూతంగా నిర్మిస్తోన్న బలరాం ఇంట్లో స్విచ్ బోర్డులు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటి ముందు వస్తువులను తగులబెట్టి... కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.
గ్రామంలో భారీ భద్రత...
దాడి నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం భీంగల్ మండలం బాబానగర్ శివారులో కలీం హత్య జరిగిన తర్వాత కుటుంబీకులు ఘటనా స్థలంలోనే ఆందోళన చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లిన అనంతరం నిందితుడి ఇంటిపై దాడికి దిగారు.
ఇవీ చూడండి : 'రియల్ గొడవలతో వ్యక్తి దారుణ హత్య... పీఎస్లో లొంగుబాటు'