బాల్కొండలో మత్స్యకారులు చెరువులో చేపల వేట కోసం వల వేయగా అందులో భారీ కొండ చిలువ చిక్కింది. అలీం చెరువులో చేపలు పట్టడానికి పల్లికొండ గంగాధర్ వలను వేశాడు. కాసేపటికి వలను లాగగా బరువుగా వచ్చింది. వలలో చేపలకు బదులు కొండు చిలువ చిక్కింది. మత్స్యకారుడు గంగాధర్ భయాందోళనకు గురై వలను చెరువులోనే వదిలిపెట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మిగితా జాలర్లను పిలిచి విషయం చెప్పగా.. అంతా కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి చంపేశారు.
ఈ చెరువుకు మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేయించినా గుత్తేదారు చెరువులోని పూడికను గాని, చుట్టు పక్కల గల తూటి, ముళ్ల పొదలను తొలగించలేదు. ఈ పొదల్లో కొండ చిలువలు నివాసం ఏర్పరచుకొని చెరువులోని చేపలను తింటున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకుని పొదలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: డ్రగ్స్ కేసులో కనిపించని నటీమణుల పేర్లు