ETV Bharat / state

డిచ్​పల్లిలో కరోనా బారిన పడి ఇద్దరు మృతి - corona death cases in nizamabad district

నిజామాబాద్​ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్​ కేసులతో పాటు కొవిడ్​ మరణాలు స్థానికులను కలవరానికి గురిచేస్తున్నాయి. డిచ్​పల్లి మండలంలో ఈ రోజు కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు.

corona death cases in dichpally
డిచ్​పల్లిలో కరోనాతో ఇద్దరు మృతి
author img

By

Published : Apr 21, 2021, 8:21 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలో కరోనా సోకి ఇద్దరు మృతి చెందారు. ఐకేపీలో ఏపీఎమ్​గా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్​కు కొద్ది రోజుల కిందట కొవిడ్​ బారిన పడ్డారు. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతని తండ్రి రెండు రోజుల క్రితం కరోనా బారిన పడి మృతి చెందారు.

మండల పరిధిలోని బర్దిపూర్ మాజీ సర్పంచ్ నిరాడి నందుబాబుకు ఇటీవలే కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. హోమ్ క్వారెంటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. నందుబాబు నిద్రపోతుండగా ఆలస్యంగా లేస్తాడులే అనుకుని.. కాసేపయ్యాక కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూస్తే అప్పటికే ఆయన చనిపోయారు. ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: 'ప్రభుత్వానికి ఎన్నికలమీదున్న సోయి ప్రజల ప్రాణాలపై లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.