నిజామాబాద్ జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంకాలనీ రోడ్లో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద రేషన్ బియ్యం నింపుకొని రవాణాకు సిద్ధంగా ఉన్న 2 అశోక్ లేలాండ్( డ్రాస్టార్) వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సిబ్బంది తెలిపారు.
రెండు వాహనాలతో పాటు, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ జలాలుద్దీన్‌తో పాటు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్ మొహమ్మద్ సల్మాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు