పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర సాధన కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతు ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పసుపు రైతులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన రైతు ప్రతినిధులు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు.
పసుపు రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ మద్దతు పలికారు. దిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతులకు నివాళిగా అన్నదాతలు మౌనం పాటించారు.
ఇదీ చూడండి: భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్