ఆర్టీసీని మూసేయడం... లేదంటే ప్రైవేటుకు అప్పగించడం జరగదని ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ (Tsrtc Chairman Bajireddy Goavrdhan) స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆర్టీసీ(Rtc)ని నష్టాల నుంచి లాభాల బాటలోకి తేకపోయినా.. నష్టాలయినా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. కరోనా (Corona) వల్ల ఆర్టీసీ (Rtc) తీవ్రంగా నష్టపోయిందని.. గతంలో రోజూ రూ.14కోట్ల ఆదాయం వస్తే.. కరోనా వల్ల కేవలం రూ.3కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. పక్క రాష్ట్రాల్లో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని.. తెలంగాణలో మాత్రం ఆలస్యమైనా చెల్లించామని చెప్పారు. బడ్జెట్లో రూ.3వేల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోందని చెప్పారు.
నష్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడమే కాకుండా.. నష్టాలు తగ్గించే సలహాలు కూడా ఇవ్వాలని సూచించారు. ఆర్టీసీలో దుబారాను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బస్సులు బయలుదేరే వేళలు.. ఆదాయం లేని రూట్లలో తిప్పడం, రద్దీ వేళ్లలో బస్సులు నడపకపోవడం వంటిని పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. కార్గో సేవలకు మరిన్ని బస్సులు కేటాయించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని బాజిరెడ్డి (Bajireddy) స్పష్టం చేశారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. లాభాల బాటలో తీసుకురాకపోయినా... నష్టాలపాలు కాకుండా చూస్తాం. కరోనా రాకముందు ఆర్టీసీ ఆదాయం ప్రతిరోజూ 14 కోట్ల రూపాయలు ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత ఆర్టీసీ ఆదాయం 3 కోట్ల రూపాయలకు పడిపోయింది. కోలుకోలేని దెబ్బ ఆర్టీసీకి తగిలింది. కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తయారైంది.
-- బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్ఆర్టీసీ ఛైర్మన్
ఇదీ చూడండి: Bus Bhavan Vaastu: దారి మారిస్తేనే దశ మారుతుందటా..!