ETV Bharat / state

'బీడీ కార్మికుల బతుకును కేంద్రం రోడ్డుకీడుస్తోంది'

author img

By

Published : Mar 16, 2021, 8:37 PM IST

బీడీ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు ఎస్ పోశెట్టి కోరారు. పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కార్మికుల బతుకును రోడ్డుకీడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీడీ కార్మికులను ఆదుకోవాలన్న తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు పోశెట్టి

కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల చట్టం తీసుకొచ్చి బీడీ కార్మికుల బతుకులను రోడ్డుకీడుస్తోందని తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు ఎస్ పోశెట్టి ఆరోపించారు. బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.

కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని పోశెట్టి కోరారు. బీడీ పరిశ్రమపై రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. 90 శాతం మహిళలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వెయ్యి బీడీలకు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి 23 శాతం పన్ను చెల్లిస్తున్నారని అన్నారు. బీడీ పరిశ్రమలో జరుగుతున్న శ్రమ దోపిడీ అరికట్టేందుకు కార్మికులు ఉద్యమించాలని సూచించారు.

ఇదీ చూడండి: పాడి రైతులకు 'ప్రోత్సాహక' బకాయిల విడుదలకు గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.