నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని టోల్ ప్లాజా వద్ద తీన్మార్ ఫేమ్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ను తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. అనంతరం మల్లన్న కారుపై రాళ్లు రువ్వారు. ఆర్మూర్ స్టేషన్లో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆర్మూర్ తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్లన్న కారును ముట్టడించారు. అనంతరం నిరసనలు తెలిపారు. స్పందించిన పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో బాధితుడి వాంగ్మూలం రికార్డు చేసి హైదరాబాద్ పంపించారు.
హేయమైన చర్య : నారాయణ
తీన్మార్ మల్లన్నపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. తెలంగాణలో తెరాస వ్యతిరేక గొంతులను బతకనివ్వరా అని ప్రశ్నించారు. సాక్షాత్తు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్లో ఉండగానే శాంతి భద్రతల సమస్య ఏ దుస్థితిలో ఉందో గమనించాలని కోరారు.
ఇవీ చూడండి : ఎస్ఆర్ఎస్పీ వరదకాల్వ ఎగువన నీటి ఇబ్బందులపై సీఎం సమీక్ష