నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద వాగు ప్రక్కన ఉన్న పొలంలో ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా వాహనం అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. సుమారు రెండు గంటలపాటు శ్రమించి క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్ పబ్బా శ్రీను మృతి చెందాడు. మృతునికి ఫిట్స్ ఉన్నట్లు తోటి కూలీలు తెలిపారు. అందువల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వైకల్యమే సిగ్గుపడేలా.. తోటివారికి సమానంగా..