ETV Bharat / state

'TSPSC పేపర్ లీకేజీ.. టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌.. కేసీఆర్‌కు దగ్గరి బంధువు' - రేవంత్​రెడ్డికి సిట్ నోటీసులు

Revanthreddy on TSPSC Leakage Issue : టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌.. కేసీఆర్‌కు దగ్గరి బంధువని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ ప్రతిపాదనతో టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ను సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్‌ కార్పొరేషన్ పనిచేస్తోందని తెలిపారు. టీఎస్‌టీఎస్‌ ఉద్యోగి రాజశేఖర్‌కు టీఎస్‌పీఎస్‌సీ డైరెక్ట్‌ యాక్సిస్‌ ఎలా లభించిందని రేవంత్​ ప్రశ్నించారు.

Revanthreddy
Revanthreddy
author img

By

Published : Mar 20, 2023, 7:19 PM IST

Revanthreddy on TSPSC Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రతిపక్షాలు ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఈ లీకేజీ కేసుపై అధికార పార్టీ హాస్తం ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఇదే వ్యవహారంపై పాదయాత్రలో భాగంగా నిజామాబాద్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్‌ కార్పొరేషన్ పనిచేస్తోంది : ఐటీ శాఖ కింద టీఎస్‌టీఎస్‌ పనిచేస్తోందన్న రేవంత్​.. కంప్యూటర్ల కొనుగోలు, నిర్వహణ టీఎస్‌టీఎస్‌ బాధ్యతే అని అన్నారు. ఐటీశాఖ అనుమతి తీసుకున్నాక కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారన్నారు. టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌.. కేసీఆర్‌కు దగ్గరి బంధువని పేర్కొన్నారు. కేటీఆర్‌ ప్రతిపాదనతో టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ను సీఎం కేసీఆర్ నియమించారన్నారు. ఐటీ మంత్రి కింద టీఎస్‌టీఎస్‌ కార్పొరేషన్ పనిచేస్తోందని తెలిపారు. కంప్యూటర్ల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కార్పొరేషన్ ద్వారా జరుగుతుందని రేవంత్​ వ్యాఖ్యానించారు.

'ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డి 2017లో ఉద్యోగంలో చేరారు. 2021లో నియామకమైన నాకు ఘటనతో సంబంధమేంటని జగన్‌ వాదిస్తున్నారు. కేటీఆర్‌ వద్ద పనిచేసే తిరుపతి టీఎస్‌టీఎస్‌ శాఖపై ఒత్తిడి తెచ్చారు. మల్యాలకు చెందిన రాజశేఖర్‌రెడ్డిని తిరుపతి నియమించారు. 2017లో టీఎస్‌పీఎస్సీలో రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. గతంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని కేటీఆర్‌ సందర్శించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కంప్యూటర్లు అప్‌గ్రేడ్‌ చేయాలని సూచించారు. కంప్యూటర్లను ఐటీశాఖ నుంచి ఏర్పాటు చేస్తామన్నారు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కంప్యూటర్ల సమాచారం బయటకు రావడానికి బాధ్యత ఐటీ మంత్రిదే : ఇప్పుడు పేపర్ లీకేజీ నేరంతో తనకు సంబంధం లేదని కేటీఆర్‌ చెబుతున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ శాఖలో నైనా కంప్యూటర్లు టీఎస్‌టీఎస్‌ ద్వారానే పెట్టాలన్న ఆయన.. రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ల నిర్వహణ, మరమ్మతులు చూస్తారని పేర్కొన్నారు. రాజశేఖర్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మి, ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఆధ్వర్యంలో పనిచేయాలన్నారు. రాజశేఖర్‌కు ఏం అవసరం వచ్చినా అధికారులు ఉండాలని తెలిపారు. టీఎస్‌టీఎస్‌ ఉద్యోగి రాజశేఖర్‌కు టీఎస్‌పీఎస్‌సీ డైరెక్ట్‌ యాక్సిస్‌ ఎలా లభించిందని రేవంత్​ ప్రశ్నించారు.

'కంప్యూటర్ల భద్రతపై ఐటీశాఖ ఆడిట్‌ జరగాలి. ఆడిట్‌ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం ధ్రువీకరించిన ఏజెన్సీనే ఆడిట్‌ కోసం ఏర్పాటు చేయాలి. కంప్యూటర్ల సమాచారం బయటకు రావడానికి బాధ్యత ఐటీ మంత్రిదే. నాకు సిట్ నోటీసులు ఇవ్వడం నేను ఊహించిందే. ఇప్పటికైతే సిట్ నోటీసులు నాకు చేరలేదు. ఒకవేళ వస్తే సిట్ నోటీసులు స్వాగతిస్తాను. రాజ్యాంగం, సంస్థల పట్ల గౌరవం ఉన్న పార్టీ కాంగ్రెస్​. ప్రభుత్వం మమ్మల్ని వేధించాలనే ఉద్దేశంతో మాకు నోటీసులు ఇస్తోంది.'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.