ETV Bharat / state

త్వరలోనే విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్​ తీసుకొస్తాం: రేవంత్​రెడ్డి - revanth reddy on agnipath riots

revanth reddy: రైతు డిక్లరేషన్ మాదిరిగానే త్వరలోనే విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్ తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్​ అధికారం చేపట్టాక నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన రేవంత్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు ఆయనను ఇందల్​వాయి టోల్​గేట్​ వద్ద వదిలిపెట్టగా.. అక్కడ ఆయన మాట్లాడారు.

త్వరలోనే విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్​ తీసుకొస్తాం: రేవంత్​రెడ్డి

author img

By

Published : Jun 17, 2022, 10:47 PM IST

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాల్పుల్లో రాకేష్ అనే విద్యార్థి చనిపోవడం బాధాకరం.

    ఇది బీజేపీ - టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన హత్య. దీనికి రెండు ప్రభుత్వాలు బాధ్యతవహించాలి.
    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.#RollBackAgnipathScheme #Secunderabad

    — Revanth Reddy (@revanth_anumula) June 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

revanth reddy: విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తితో సాధించిన రాష్ట్రంలో.. సీఎం కేసీఆర్​ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లిన రేవంత్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. లోకేశ్వరం పోలీస్​స్టేషన్​కు తరలించారు. అనంతరం ఆయనను ఇందల్​వాయి టోల్​గేట్​ వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న తనను అడ్డుకునేందుకు వేల మంది పోలీసులను బందోబస్తుగా పెట్టిన ప్రభుత్వానికి.. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం చేతకావడం లేదా అని ప్రశ్నించారు. భారాస ఏర్పాటు కోసం గంటల తరబడి చర్చలు పెట్టే కేసీఆర్​కు.. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడానికి సమయం లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే రైతు డిక్లరేషన్ మాదిరిగానే విద్య, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్ తీసుకొస్తుందని రేవంత్​రెడ్డి ప్రకటించారు. రాబోయే 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

వర్సిటీలను నిర్వీర్యం చేస్తూ విద్యావ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారు. భారాస ఏర్పాటు కోసం గంటల తరబడి చర్చలు పెట్టే కేసీఆర్​కు.. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడానికి సమయం లేకపోవడం సిగ్గుచేటు. బాసర విద్యార్థుల సమస్యలపై మంత్రుల బృందం ఏర్పాటు చేయాలి. రైతు డిక్లరేషన్ మాదిరిగా విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్ తీసుకొస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం.- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రాకేశ్‌ హత్యకు బాధ్యత వహించాలి..: మరోవైపు సికింద్రాబాద్ ఆందోళన ఘటనపై రేవంత్ రెడ్డి​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. పోలీసుల కాల్పుల్లో విద్యార్థి రాకేశ్‌ మృతి చెందడం బాధాకరమన్నారు. ఇది భాజపా-తెరాస ప్రభుత్వాలు కలిసి చేసిన హత్యగా అభివర్ణించారు. రాకేశ్‌ హత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఇవీ చూడండి..

గోడ దూకి బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్​లోకి వెళ్లిన రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్​లో సాధారణ పరిస్థితులు.. పట్టాలెక్కిన షెడ్యూల్‌ రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.