అనేక ఆరోపణలపై జైలులో ఉన్న తీన్మార్ మల్లన్న విషయమై... ఆయన భార్య మాతమ్మ (theenmar mallanna wife) దిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు (amit shaw) వివరించారు. తెలంగాణ ప్రభుత్వం... తన భర్త మల్లన్నపై 35కి పైగా కేసులు పెట్టి... ఇబ్బందులకు గురిచేస్తోందని అమిత్‌షాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన భర్తను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతుందని పేర్కొన్నారు. ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసు నమోదు చేసి బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.
మల్లన్నపై పెడుతున్న కేసుల విషయమై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అమిత్‌షాకు వినతి పత్రం అందజేశారు(theenmar mallanna family meet with amit shaw) . ఆమె వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింది, మల్లన్న సోదరుడు వెంకటేశ్ ఉన్నారు. తీన్మార్ మల్లన్న విషయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.
మూడు రోజుల క్రితం ఎడవల్లి పోలీసుల కస్టడీకి
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టు అనుమతితో మూడు రోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. డబ్బులు ఇవ్వాలంటూ జానకంపేట గ్రామానికి చెందిన సంతోష్, రాధాకిషన్‌గౌడ్, సాయాగౌడ్, రాజుగౌడ్ అనే వ్యక్తులు తీన్మార్ మల్లన్నతో కలిసి బెదిరించారని నిజామాబాద్ జిల్లా జానకంపేటకు చెందిన కల్లు ముస్తేదారు(విక్రయదారుడు) జయవర్ధన్‌గౌడ్ కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నను రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమకేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మల్లన్న మద్దతు దారులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
సంబంధిత కథనాలు: Teenmar Mallanna: ఒకటి తర్వాత మరొకటి కేసు... హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna: సెప్టెంబర్ 9 వరకు తీన్మార్ మల్లన్నకు రిమాండ్
Thinmar Mallanna: 'తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసు ఇండియాలోనే మొదటిది'
Teenmaar Mallanna arrest : తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్