ETV Bharat / state

నిండుకుండలా శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​.. దిగువకు నీటి విడుదల - ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​ తాజా వార్తలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో జలకల సంతరించుకుంది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1090.8 అడుగులుగా ఉంది. ఫలితంగా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

The Sriramsagar project, which is looking to fill up .. water release to the bottom
నిండుకుండను తలపిస్తోన్న శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​.. దిగువకు నీటి విడుదల
author img

By

Published : Sep 14, 2020, 9:21 PM IST

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 12,500 క్యుసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ సుశీల్ దేశ్ పాండే, ఈఈ రామారావులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలతో పాటు బాలేగావ్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి 77 వేల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదిలారు. ఫలితంగా ఎస్సారెస్పీలోకి 54 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1090.8 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 89.2 టీఎంసీలుగా ఉంది.

ప్రాజెక్టు నుంచి ప్రధాన గేట్ల ద్వారా 12,500 క్యుసెక్కులు, వరద కాల్వ గేట్ల ద్వారా 13,736 క్యుసెక్కులు విద్యుత్ ఉత్పత్తి కోసం ఎస్కేప్ గేట్ల ద్వారా 3000 క్యూసెక్కులు, పంట కాల్వలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాల్వలకు 4900 క్యూసెక్కులు, అలీసాగర్, గుత్ప ప్రాజెక్టులకు 810 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం మరో 152 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడం వల్ల జలకళ సంతరించుకుంది. కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు పరిసరాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిగా నిండటం వల్ల పర్యాటకులకు అనుమతి నిలిపివేశారు. గోదావరిలోకి నీటి విడుదల చేసినందున.. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీచూడండి.. వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.