నిజామాబాద్ జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జడ్పీ ఛైర్మన్‌గా దాదన్నగారి విఠల్ రావు, వైస్ ఛైర్మన్‌గా రజిత యాదవ్లు ప్రమాణం చేశారు. వీరితో కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. తెరాస సభ్యులు జై తెలంగాణ, భాజపా సభ్యులు భారత్ మాతాకీ జై అంటూ పోటాపోటీ నినాదాలు చేయడం వల్ల సభలో గందరగోళం నెలకొంది.
ఇవీ చూడండి: బడ్జెట్ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'