నిజామాబాద్ వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం భాస్కర్ రెడ్డి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో తన తల్లి తండ్రులు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీల ఆశీర్వాదం తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి వయస్సులో తాను డీసీసీబీ ఛైర్మన్గా పనిచేశానని స్పీకర్ పోచారం తెలిపారు. తన మూడో కొడుకు భాస్కర్ రెడ్డి గెలుపొందడం తమ కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషంగా ఉందని స్పీకర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్