ETV Bharat / state

ఆ 4 గ్రామాల రైతులకు ధాన్యం అమ్మితే నష్టమే మిగిలింది - farmers latest news

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కొందరు పెట్టుబడిదారుల మూలంగా ఆభాసుపాలవుతోంది. నిజామాబాద్ జిల్లా సావేల్ సహకార సంఘం ద్వారా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ 4 గ్రామాల రైతులకు ధాన్యం అమ్మితే నష్టమే మిగిలింది

author img

By

Published : Aug 1, 2020, 7:59 AM IST

నిజామాబాద్ జిల్లా సావేల్ సహకార సంఘం ద్వారా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోలులో దళారుల వ్యవస్థ ఉండకూడదని కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే సొసైటీ అధికారులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించట్లేదని అన్నదాతలు మండిపడ్డారు.

మొత్తం 4 గ్రామాల రైతులకు అన్యాయం...

నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలోని సావేల్ సొసైటీ ద్వారా మొత్తం 101 లారీల లోడు రైస్ మిల్లులకు విక్రయించారు. 4 గ్రామాల రైతులు అమ్మిన ధాన్యానికి మొత్తం పెట్టుబడి రాకపోగా ఒక్కొక్క రైతుకు సుమారు 30,000 వేల రూపాయల వరకు తక్కువగా వచ్చినట్లు వాపోయారు. సొసైటీ పరిధిలోని మొత్తం రైతులకు కలపి రూ.23 లక్షలు రావాల్సి ఉండగా... ఇప్పటికీ సొసైటీ అధికారుల స్పందన కరువైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు తమకు చెల్లించాల్సిన డబ్బులు మొత్తం వెంటనే ఇప్పించాలని ధర్నా నిర్వహించారు. సావేల్ , కోడిచర్ల, చాకిర్యల్, మెండోరా గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు : రాజు గంగపుత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.