నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల తహసీల్దార్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు... ఓ మహిళా వీఆర్ఏ ఉపతహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన ఫిర్యాదును జిల్లా పాలానాధికారితోపాటు ఇతర ఉన్నతాధికారులకు కూడా పంపించాలని ఆమె కోరారు. విధుల పేరుతో కార్యాలయానికి పిలింపించుకొని అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
![THAHASILDAR_PI_LINGIKA_VEDIMPULA_PIRYADU IN NIZAMABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3109265_gvk.png)
ఇవీ చూడండి: వివాహ విందుకు వెళ్తున్న ట్రాలీ వ్యాన్ బోల్తా !!