నిజామాబాద్ జిల్లా పసుపు తవ్వకాలు ఊపందుకున్నాయి. జిల్లాలో సుమారు 33 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. 15 రోజులుగా రైతులు తవ్వకాలు చేపడుతున్నారు. ఏళ్ల తరబడి సంప్రదయబద్ధంగా సాగుచేస్తున్న ఆలమూరు ప్రాంతంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. పసుపును ఆరబెట్టి మార్కెట్కు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు