నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నామ్‌దేవ్ వాడలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న స్వప్న పదో తరగతి చదువుతున్న కొడుకును బయట తిరగకుండా బుద్ధిగా ఇంట్లో ఉండి చదువుకొమ్మని మందలించింది. తల్లి తిట్టడం వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని నిజామాబాద్ మూడో పట్టణ ఎస్సై సంతోష్ తెలిపారు. విద్యార్థి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి:మాస్క్‌తో మార్నింగ్ వాక్.. చాలా డేంజర్!