నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తాత్కాలిక డ్రైవర్లు, కండక్టరులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ సంస్థలో నియామకాలు చేపట్టినప్పుడు తమకు ప్రాధాన్యత కల్పించాలని తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు ఇన్ని రోజులు ఉపాధి కల్పించినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 50 రోజుల సేవలందించినందుకుగాను తమకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసుల అదుపులో నలుగురు