ETV Bharat / state

పోలీసులకు సవాలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసు.. - బ్యాంకు చోరీ తాజా వార్తలు

Bank Theft Investigation: సీసీ కెమెరాల కంటపడకుండా జాగ్రత్తలు.. వేలి ముద్రలు దొరక్కుండా ప్రణాళికలు.. ఊరి అవతల వాహనం నిలిపి పరారీ.. నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌ బ్యాంకు చోరీ కేసులో దొంగలు ఒక్క ఆధారం వదలకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికి ఎటువంటి పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది.

బ్యాంకు చోరీ
బ్యాంకు చోరీ
author img

By

Published : Jul 6, 2022, 1:48 PM IST

Updated : Jul 6, 2022, 3:03 PM IST

పోలీసులకు సవాలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసు..

Bank Theft Investigation: నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. దొంగలు ఒక్క ఆధారం వదలకుండా జాగ్రత్తపడ్డారు. రెండు వారాల కిందటే రెక్కీ నిర్వహించి.. సీసీ కెమెరాలు లేని మార్గంలో బ్యాంకులోకి ప్రవేశించారు. కెమెరాల ధ్వంసం మొదలుకుని.. ఎలక్ట్రానిక్ అలారం తొలగించడం వరకు ప్రణాళిక ప్రకారం చేశారు. ఎక్కడా వేలిముద్రలు పడకుండా.. సర్జికల్ గ్లౌజ్, వాటిపై మరో గ్లౌజ్ ధరించినట్లు తెలుస్తోంది. వాహనం ఊరు వెనకాల నీటి ట్యాంకు వద్ద నిలిపి రావటం చూస్తే.. దొంగలు పక్కా పన్నాగంతోనే వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బుస్సాపూర్ గ్రామానికి ఓ వైపు ఇళ్లు లేని ప్రాంతంలో... ఓ భవనం మొదటి అంతస్తులో బ్యాంకు ఉంది. బ్యాంకు ముందు నుంచి వస్తే సీసీ కెమెరాలకు చిక్కే అవకాశం ఉంటుందని దొంగలు భావించారు. అందుకు ఎవరి కంటపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. పక్కనే ఉన్న బీఎస్ఎన్​ఎల్ కార్యాలయం ఆవరణలోని ట్రాక్టర్ ఇనుప గొర్రు చక్రాలు.. ఒకదానిపై ఒకటి పేర్చుకొని బ్యాంకు మెట్లపైకి చేరారు. నలుగురి కంటే ఎక్కువ మంది చోరీలో పాలుపంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

బ్యాంకు వద్ద భద్రతా లోపాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఎలక్ట్రానిక్ ఆటోమెటిక్ సెన్సార్ అలారం మోగకపోవటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైర్లను కోసినప్పుడు అంతరాయం తలెత్తి సెల్‌ఫోన్‌కు సంకేతం అందాలి. కానీ అలా జరగలేదు. అసలు అలారం పనిచేస్తుందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూం ఆటోమెటిక్ తాళం కొంతకాలంగా పనిచేయటం లేదని పోలీసులు తెలిపారు. దానిని బాగు చేయించి ఉంటే దొంగలు దాన్ని తొలగించేందుకు మరింత సమయం పట్టేదని భావిస్తున్నారు. సాధారణ తాళం వేసి ఉండటంతో సులువుగా తీశారని పేర్కొన్నారు. కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: Bank theft: మంకీ క్యాప్స్.. గ్యాస్ కట్టర్స్.. జులాయి సీన్ రిపీట్..!

'అగ్నిపథ్'​కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. చరిత్రలో తొలిసారి..

Last Updated : Jul 6, 2022, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.