నిజామాబాద్ జిల్లాలోని రేషన్ డీలర్లకు టీవాలెట్పై అవగాహన కల్పించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రేషన్ డీలర్లకు టీవాలెట్ వినియోగంపై పౌరసరఫరా అధికారులు శిక్షణ ఏర్పాటు చేశారు. దీనికి జేసీ వెంకటేశ్వర్లు, డీపీఎఫ్ఓ పద్మజ హాజరయ్యారు. అన్ని రకాల బిల్లులను టీవాలెట్ ద్వారా చెల్లింపులు చేయొచ్చని.. దీని మీద డీలర్లకు కమిషన్ వస్తుందని పేర్కొన్నారు. మీసేవ లాగే ప్రజలకు టీవాలెట్ ద్వారా రేషన్ డీలర్లు సేవలు అందించవచ్చని తెలిపారు. తద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇవీచూడండి: తుమ్మిడిహట్టికి ఎందుకు.. కాళేశ్వరం వెళ్లండి: కొప్పుల