ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని ఎస్సారెస్పీ నూతన ఎస్ఈ సుశీల్ కుమార్ తెలిపారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ గురించి పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1088.50 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి మట్టానికి మరో రెండడుగల దూరంలో ఉండటం వల్ల ఎగువ నుంచి వరద వస్తే.. గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్ఈ సుశీల్ కుమార్ తెలిపారు.
- ఇవీ చూడండి: 'పరీక్షలను వాయిదా వేయగలం కానీ ... రద్దు చేయలేం'