వసతి గృహాల్లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల నిరసనపై స్పందించిన రిజిస్టర్ యూనివర్శిటీకి డిసెంబరు 4 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు తక్షణమే వసతి గృహం విడిచి వెళ్లాలని యునివర్సిటీ రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రిజిస్టర్ నిర్ణయంపై ఆగ్రహించిన విద్యార్థులు సెలవులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో యూనివర్సిటీకి సెలవులు రద్దు చేస్తున్నట్లు రిజిస్టర్ ప్రకటించారు.
ఇదీ చూడండి: వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళన