నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రోజువారి వేతనాలు పెంచేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నాచేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా జీవో జారీచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్శిటీలో బోధన, బోధనేతర సిబ్బంది సుమారు 250 మంది వరకు పనిచేస్తున్నారని, వారందరికి కనీస వేతనం పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఉచిత శిక్షణతో ఉపాధి పొందుతున్న మధిర మహిళలు