నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద జరుగుతున్న శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం పనులను రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాణాధారమైన ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పునరుజ్జీవన పథకం పనులు చేపట్టామని మంత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయని తెలిపారు.
ఇవీ చూడండి: 'మహా' వర్షాలకు 2 రోజుల్లో 53 మంది బలి