నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు గత పదిహేను రోజులుగా వస్తున్న వరద ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఎగువ నుంచి ఉన్న వాన నీటి ఉద్ధృతి నేపథ్యంలో ఈనెల 14న పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండుకోవడం వల్ల 4 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. అనంతరం క్రమంగా వరద పెరుగుతూ ఉండడం వల్ల మరల 40 గేట్లు ఎత్తి 1,75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చారు.
గేట్లు మూతపడ్డాయి..
ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీనితో బుధవారం గేట్లను మూసివేశారు. అయితే ప్రస్తుత జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31 టీఏంసీల సామర్థ్యంతో ఉంది.
ఇదీ చదవండి: కోమటి చెరువు సందర్శనకు అనుమతి