నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ నాందేవ్ మహరాజ్ పుణ్యతిథి శోభాయాత్ర ఘనంగా సాగింది. పట్టణంలోని శ్రీ నగరేశ్వర మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ మందిరం, పాత బస్టాండు, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం వరకు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇవీ చూడండి: తాగిన మత్తులో ఎస్సైకి ముద్దిచ్చాడు... అరెస్ట్