నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ముల్లంగి(బి) గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ముల్లంగి(బి) గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, మురుగు కాల్వలను విఠల్ రావు పరిశీలించి పనులపై ఆరా తీశారు. మురుగు, వర్షం నీరు.. నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. మంచి నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలని సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు.
ఇదీ చూడండి: విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు