నిజాంబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు గత రెండు రోజులుగా స్వల్ప వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089.5 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడానికి కేవలం ఒకటిన్నర అడుగుల దూరం ఉంది.
జలాశయం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 82. 215 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 12,934 క్యూసెక్కులు ఉండగా... కాకతీయ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!