నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద మొదలైంది. గత నెలలో రికార్డు స్థాయిలో వరద రావడం వల్ల నెలరోజులోనే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయింది.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19 వేల 666 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 7613 క్యూసెక్కులు ఉంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1901 అడుగులకు గానూ.. ప్రస్తుతం 1089.8 అడుగుల మేప నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 90.31 టీఎంసీలకు ప్రస్తుతం 83.772 టీఎంసీల నీరు ఉంది.
- ఇదీ చూడండి : 'రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా మాట్లాడాలి'