నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో హరితహారంలో భాగంగా గురువారం మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు.
ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని ఏసీపీ జయపాల్ రెడ్డి కోరారు. మొక్కలు పెంచి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పల్లె రాకేశ్, రూరల్ సీఐ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం