ETV Bharat / state

శ్రీరాంసాగర్​కు పోటెత్తిన వరద.. 16 గేట్లు ఎత్తివేత - srsp in nizamabad district

రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద చేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు 16 గేట్లు ఎత్తి.. 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

sixteen gates of sriram sagar project are lifted
శ్రీరాంసాగర్​కు పోటెత్తిన వరద
author img

By

Published : Oct 15, 2020, 7:17 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగుల వద్దకు నీరు చేరింది. 16 గేట్ల ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టులోకి 63వేల 103 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. వర్షాల వల్ల వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశముందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.