నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను మేయర్ నీతూ కిరణ్ సన్మానించారు. ప్రతినెలా మొదటి సోమవారం ఉత్తమ సేవలు అందించిన కార్మికులను ప్రతి జోన్ నుంచి ఇద్దరి చొప్పున మొత్తం 12 మందికి మేయర్ బహుమతులు అందజేశారు. నగరంలోని 6 జోన్లలో విధులు నిర్వహించే కార్మికులను కార్పొరేషన్ కార్యాలయంలో వెండి పతకాలతో ఘనంగా సత్కరంచారు.



నగర శుభ్రతకు ఎనలేని సేవలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ సన్మానం సరిపోదని వారిసేవ ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు చెత్తను క్రమపద్ధతిలో కార్మికులకు అందిస్తే నగరం అద్భుతంగా తయారవుతుందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్, కార్పొరేటర్లు మృదుల, సవిత, లత, విక్రమ్ గౌడ్, సాయి వర్ధన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్